అధిక బరువు ఉన్నవారు ఓట్స్ తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Oats weight loss : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం అనేది చాలా సులువుగా జరిగిపోతుంది…అదే బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి.
అలాగే బరువును తగ్గించటానికి సహాయపడే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. అందుకే ఈ మధ్య చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఓట్స్ తింటున్నారు. ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, పొటాషియం, నియాసిన్, విటమిన్ ఎ, బి6, బి12, విటమిన్ డి మొదలైన పోషకాలు ఉన్నాయి
ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ అనేది మన శరీరంలో ఒక హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని నియంత్రిస్తుంది.కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు. ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా మన శరీరంలో శక్తి స్థాయిని కూడా నిర్వహిస్తుంది.
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొవ్వు శోషణను నిలిపివేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఓట్స్ ని నీటిలో లేదా పాలల్లో ఉడికించి తీసుకోవచ్చు. అలా కాకుండా ఉప్మా, ఇడ్లీలు వలె చేసుకొని తినవచ్చు.
ఈ విధంగా బరువును తగ్గించే ఆహారాలను తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే తప్పనిసరిగా 15 రోజుల్లో తేడా కనపడుతుంది. కాబట్టి ఓట్స్ తింటూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య తగ్గుతుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.