డయాబెటిస్ ఉన్నవారు చింతపండు తింటే ఏమి అవుతుందో తెలుసా?
Health Benefits Of Tamarind : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు చింతపండు తింటే మంచిదా…కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే.
అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే మంచిది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. కఠినమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
అలాగే ప్రతి రోజు తాగే కాఫీ,టీలలో పంచదార లేకుండా తాగాలి. చింతపండు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెప్పు తున్నారు. చింతపండును రెగ్యులర్ గా మనం వాడుతూనే ఉంటాం. ఆహారంలో చింతపండును వాడటం, చింతపండును కొద్దిగా నోటిలో వేసుకోవడం…తరచుగా చింతపండు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
చింతపండు గ్లైసెమిక్ ఇండెక్స్ 23. అలాగే ఫైబర్ మరియు ఇతర పోషకాలు సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటమే కాకుండా హెచ్చు తగ్గులు లేకుండా చేస్తుంది. చింతపండులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు B1, B2 మరియు B3 పుష్కలంగా ఉన్నాయి.
అదనంగా, విటమిన్ సి, విటమిన్ K, విటమిన్ B5, విటమిన్ B6, కాపర్, ఫోలేట్ మరియు సెలీనియం కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చింతపండు తినడం వల్ల నాలుక శుభ్రపడుతుంది మరియు కడుపు కూడా శుభ్రపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే ఏదైనా సరే లిమిట్ గానే తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.