ఉదయం పరగడుపున ఉసిరి రసం తాగితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Amla Juice Health benefits in telugu : ఉసిరిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పుల్లని రుచితో ఉండే ఉసిరిలో విటమిన్ సి సమృద్దిగా ఉండటమే కాకుండా పోషకాల భాండాగారం అని చెప్పవచ్చు. కొంతమంది పచ్చిగా తినడానికి ఇష్టపడతారు…కొంతమంది జ్యూస్ తాగటానికి ఇష్టపడతారు.
విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే జలుబు,దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి రాకుండా కాపాడుతుంది. జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. ఉసిరిలో కెరోటిన్ ఉండుట వలన కంటి చూపు బాగుండేలా చేయటమే కాకుండా కంటి శుక్లం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. ఉసిరిలో యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఎమెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పెంచుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఉండే క్రోమియం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఉదయం పరగడుపున తాగటం వలన అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.
రెండు ఉసిరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి ఒక కప్పు నీటిని పోసి బాగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తేనె కలిపి తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. సీజన్ లో అయితే తాజా ఉసిరికాయలతో జ్యూస్ తయారుచేసుకోవచ్చు. సీజన్ కానప్పుడు ఉసిరి పొడిని ఉపయోగించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.