అరస్పూన్ పొడిని గ్లాసు నీటిలో కలిపి తాగితే ఎంత లావు ఉన్నా…సన్నగా మారడం ఖాయం
Best weight Loss Drink : ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం,శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవన శైలి వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. బరువు తగ్గించు కోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశ చెందుతున్నారు.
అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన అధిక బరువు తగ్గించుకునే ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలి. బరువు తగ్గించుకోవడానికి ఒక పొడి తయారు చేసుకుని ప్రతిరోజు నీటిలో కలిపి తాగితే కచ్చితంగా 15 రోజుల్లో బరువు తగ్గటం గమనించి ఆశ్చర్యపోతారు.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అర కప్పు సోంపు గింజలు, 15 యాలకులు, రెండు స్పూన్ల లవంగాలు, అర స్పూన్ మిరియాలు, అర అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిన్న ముల్లెటి ముక్క వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేగించాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ చేయాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల శొంఠి పొడి, అర స్పూన్ జాజికాయ పొడి వేసి మరల ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల రోజులు పాటు వాడుకోవచ్చు. గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత స్పూన్ తో బాగా కలిపి ఆ నీటిని తాగాలి. .
ఈ డ్రింక్ ప్రతిరోజు తాగటం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరగటమే కాకుండా డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాస్త ఓపికగా ఇటువంటి పొడులను తయారు చేసుకుని తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పొడిని తీసుకొని అధిక బరువు సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.