గర్భధారణ సమయంలో జీడిపప్పు తింటే ఏమి అవుతుందో తెలుసా?
Cashew nuts benefits pregnancy : గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. గర్భధారణ సమయంలో జీడిపప్పు తీసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. ఇలాంటి ఆహారాల తీసుకునేటప్పుడు డాక్టర్, డైటీషియన్ సలహాతో తీసుకుంటే మంచిది.
జీడిపప్పులో జింక్ సమృద్ధిగా ఉండుట వలన బిడ్డలో కణాల ఉత్పత్తికి ఎంతో సహాయపడుతుంది. అలాగే జీడిపప్పులో ఉండే కాల్షియం బిడ్డ పుట్టిన తర్వాత చిగుళ్ళు, దంతాలు గట్టిగా ఉండటానికి సహాయపడుతుంది. పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన పుట్టుక లోపాలు లేకుండా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి బాగా జరిగి రక్తహీనత సమస్య ఉండదు
గర్భధారణ సమయంలో మహిళలు బరువు తక్కువగా ఉంటే జీడిపప్పు చాలా బాగా సహాయపడుతుంది. జీడిపప్పులో ఉండే క్యాలరీలు, కొవ్వు పదార్థాలు బరువు పెరగడానికి సహాయపడతాయి. జీడిపప్పులో ఉండే విటమిన్ K గర్భిణీ శరీరంలో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచుతుంది. సిజేరియన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది వరంలా ఉపయోగపడుతుంది.
గర్భధారణ సమయంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. జీడిపప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకం సమస్య అనేది ఉండదు. అలాగే కడుపులో ఉన్న బిడ్డ ఎలర్జీల బారిన పడకుండా కాపాడుతుంది. మిగతా డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు లేదా చాక్లెట్, కేక్, స్వీట్ల రూపంలో తీసుకోవచ్చు
అయితే జీడిపప్పు అంటే పడని వారికి ఎనర్జీ రావచ్చు. అలాగే రక్తపోటు పెరగవచ్చు. అంతేకాకుండా బరువు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. పొట్ట కింద నొప్పి, తిమ్మిరిగా ఉండటం, వాంతులు వంటి సమస్యలు ఉంటే జీడిపప్పు తినడం ఆపేసి డాక్టర్ని సంప్రదించాలి. జీడిపప్పు రోజులో 4 లేదా 5 పప్పులను తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.