అధిక బరువు ఉన్నవారు చపాతీ తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Diet For weight Loss : ప్రతి రోజు సమతుల్య ఆహారం తీసుకుంటే బరువు అనేది నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అధిక బరువు సమస్యతో బాధ పడేవారు డైటింగ్ చేస్తూ ఉంటారు. చపాతీ తింటే బరువు తగ్గుతారా..అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఏ ఆహార పదార్థాన్ని తీసుకోవాలి…ఎంత మోతాదులో తీసుకోవాలి…ఏ ఆహార పదార్థానికి దూరంగా ఉండాలనే విషయాలను కూడా తెలుసుకోవాలి. బరువు తగ్గాలని అనుకొనేవారు కేలరీల గురించి కూడా తెలుసుకోవాలి. చపాతీ తింటే శరీరానికి కార్బోహైడ్రేట్లు అందుతాయి. శరీరానికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
అలాగే ఆకలిని తగ్గిస్తుంది. తినే కార్బోహైడ్రేట్లు శరీరంలో కరిగి శక్తిని అందిస్తాయి. ఏదైనా ఆహారాన్ని అవసరానికి మించి తీసుకుంటే సహజంగానే శరీరంలో కేలరీలు పెరుగుతాయి. దీంతో క్రమంగా శరీర బరువు పెరుగుతుంది. చపాతీలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అయినా సరే ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వు ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది.
చపాతీలను నూనె లేదా నెయ్యి లేకుండా తయారుచేసుకొని తినాలి. అలాగే చపాతీ మాత్రమే తినకుండా సబ్జీ, పప్పు వంటివి తింటే బాగుంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇతర ఆహారాలు తినాలన్నా కోరిక కలగదు. రోజు చపాతీ తింటూ అరగంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
ఏదైనా సరైన మోతాదులో తింటే ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువ మోతాదులో తింటే తప్పనిసరిగా బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే శరీరానికి ఎక్కువ శ్రమ కలగకుండా సులభంగా బరువు తగ్గవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.