గ్లాస్ పాలల్లో అరస్పూన్ ఉడికించి తీసుకుంటే అధిక రక్తపోటు అనేది జీవితంలో అసలు ఉండదు
Blood pressure Home Remedies : రక్తపోటు అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. రక్తపోటు తక్కువ ఉన్నా…ఎక్కువ ఉన్నా కూడా ఆ ప్రభావం మన ఆరోగ్యం మీద తీవ్రంగానే చూపుతుంది. కాబట్టి రక్తపోటు నియంత్రణ అనేది తప్పనిసరి. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడూ ఆ ప్రభావం గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కళ్ళ మీద పడుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.ఆహారంలో తప్పనిసరిగా మార్పులు అవసరం. గసగసాలు రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. గసగసాలలో పీచు, థయామిన్, కాల్షియం, మాంగనీస్, ఒమేగా-3, ఒమేగా-6, ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రొటీన్లు సమృద్దిగా ఉంటాయి.
ఒక గ్లాస్ పాలల్లో పావుస్పూన్ గసగసాలను ఉడికించి తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అరస్పూన్ ఆర్గానిక్ బెల్లం కూడా వేసుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకోవాలి. గసగసాలలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నియంత్రించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గసగసాల పాలు శరీరానికి శక్తినిచ్చి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలని ఆలోచనలో ఉన్నవారు కూడా ఈ పాలను తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. గసగసాలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వును కరిగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
గసగసాలు తీసుకోవడం వల్ల నోటిపూత నుండి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదంలో శరీరంలో వేడిని తగ్గించటానికి గసగసాలను వాడతారు. కాబట్టి ప్రతి రోజు గసగసాల పాలను తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.