Healthhealth tips in telugu

ఉదయం పరగడుపున బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…ముఖ్యంగా ఈ సీజన్ లో

Boodida gummadi kaya Benefits in telugu : కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన బూడిద గుమ్మడి శాస్త్రీయ నామం బెనిన్ కాసా హిస్పీడ. బూడిద గుమ్మడి బూడిద రంగులో ఉండి ముట్టుకుంటే బూడిదగా పొడి రూపంలో రాలుతూ ఉంటుంది. బూడిద గుమ్మడిలో అసలు కొవ్వు ఉండదు. సోడియం,పొటాషియమ్, పిండి పదార్ధాలు, పీచు, మెగ్నీషియం ,క్యాల్షియం,ఇనుము మరియు విటమిన్ ఎ,సి,డి ఉంటాయి.
Boodida gummadi
కిడ్నీలో రాళ్లను తొలగించటానికి బూడిద గుమ్మడి బాగా హెల్ప్ చేస్తుంది. గుండె సమస్యలు ఉన్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనితో కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచు, విటమిన్‌లు గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. అలాగే అందులో పొటాషియం అధిక రక్తపోటును నిరోధిస్తుంది.
Immunity foods
వ్యాధినిరోధక శక్తిని పెంచి, వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా చూస్తుంది. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మలబద్దకంతో బాధపడే వారు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుంది.
gas troble home remedies
మసాలా ఆహారాలు ఎక్కువగా తిన్నప్పుడు మరియు ఉపవాసం కారణంగా ఏమి తిననప్పుడు ఏర్పడే గ్యాస్ ని ఎదుర్కొంటుంది. యాంటీ మైక్రోబియల్ ఏజెంట్‌గా పనిచేసి కడుపు మరియు పేగులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. జీర్ణాశయానికి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
Weight Loss tips in telugu
అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. బూడిద గుమ్మడిలో 96 శాతం నీరు ఉండుట వలన బరువు తగ్గేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ప్రతి రోజు రెగ్యులర్ గా బూడిద గుమ్మడిని కూరగాను లేదా జ్యుస్ రూపంలో తీసుకుంటే క్రమంగా బరువు తగ్గుతారు. బూడిద గుమ్మడి జ్యూస్ ని ఉదయం సమయంలో తాగితే చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.