బ్లూబెర్రీలను తినకపోతే.. మీరు ఎన్ని ప్రయోజనాలను మిస్ అవుతారో తెలుసా…ముఖ్యంగా ఈ సీజన్ లో
BlueBerry Benefits In telugu : బ్లూబెర్రీలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇవి ఈ సీజన్ లో చాలా విరివిగా లభిస్తాయి. బ్లూబెర్రీలలో విటమిన్ ఎ,విటమిన్ బి కాంప్లెక్స్,విటమిన్ సి,విటమిన్-ఇ,జింక్,మెగ్నీషియం,భాస్వరం,పొటాషియం,సోడియం,రాగి వంటివి సమృద్దిగా ఉంటాయి.
ఈ సీజన్లో సమృద్ధిగా దొరికే బ్లూబెర్రీలను కచ్చితంగా తినాలి. ఎందుకంటే బ్లూబెర్రీస్ లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండ్లను అన్ని వయసుల వారు తినవచ్చు. ముఖ్యంగా పిల్లలు తింటే వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి. రోజు పిల్లలు నాలుగు బ్లూబెర్రీలను తింటే మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. శారీరక., మానసిక ఎదుగుదల బాగుంటుంది.ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ యాక్సిడెంట్ అయిన ఆంథోసైనిన్స్ గుండెపోటు నుంచి కాపాడతాయి.
అంతేకాకుండా బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంచటమే కాకుండా మెదడు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు ఈ బ్యూబెర్రీ లలో ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను కూడా తగ్గిస్తుంది. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ ‘ఆక్సిడేటివ్ ఫైటో కెమికల్స్’, ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం అని ఒక పరిశోదనలో తెలిసింది. కాబట్టి ఈ పండ్లను తిని ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.