Healthhealth tips in telugu

1 గ్లాస్ ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Cinnamon Basil Tea Benefits : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు కంగారూ పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న సమస్యలలో అధిక బరువు సమస్య ప్రధానమైనది.
Tulasi health benefits In telugu
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే టీ తాగుతూ మంచి పోషకాహారం తింటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 6 తులసి ఆకులు, అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.
Weight Loss Drink In Telugu Dalchina Chekka
బాగా మరిగిన ఈ నీటిని వడకట్టి తాగాలి. డయాబెటిస్ లేనివారు అరస్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ టీని ప్రతి రోజు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. 15 రోజులు తాగితే తేడా గమనించి చాలా ఆశ్చర్యపోతారు. తులసిలో ఉన్న లక్షణాలు జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
Weight Loss tips in telugu
దాల్చినచెక్క శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా చేసి అధిక బరువును తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం ఆకలిని అదుపులో ఉంచుతుంది. దాంతో ఆహారం తక్కువ తీసుకోవటం వలన బరువు తగ్గుతాము. అలాగే ఈ టీ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Immunity foods
ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సీజనల్ గా వచ్చే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ టీని తాగి ఆ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.