ఇలా చేస్తే ఎంతటి భరించలేని తలనొప్పి,మైగ్రేన్ అయినా సరే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది
Headache Home Remedies : తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. మనలో చాలామంది తలనొప్పి రాగానే షాప్ కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నార్మల్ తలనొప్పి అయినా మైగ్రేన్ తలనొప్పి అయినా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పుదీనా టీ తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. తాజా పుదీనా ఆకులను నమిలి మింగవచ్చు…లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 6 పుదీనా ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి.
అల్లం టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి రోజు తయారుచేసుకొనే టీలో అల్లం వేసుకుంటే సరిపోతుంది. అల్లంలో నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పిని తగ్గిస్తుంది. టీలో అల్లం వేసుకొని తాగటం కుదరని వారు…పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ అల్లం తురుము వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలుపుకొని తాగవచ్చు.
దాల్చిన చెక్క టీ కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి నొప్పులను తగ్గిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
ఇప్పుడు చెప్పిన మూడు రకాల టీలు తలనొప్పి అలాగే మైగ్రైన్ తలనొప్పి వంటి వాటి నుండి మంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. వీటిలో ఉన్న లక్షణాలు నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి. ఈ టీలను తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ మూడింటిలో మీకు లభ్యం అయినా దాన్ని బట్టి ఒక రకం టీని తాగితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.