Beauty Tips

లవంగాలలో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలకుండా 100 % ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Cloves Hair Fall Tips : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇలా జుట్టు రాలే సమస్య ఎక్కువైతే జుట్టు పల్చగా మారి బట్టతల వచ్చే ప్రమాదం కూడా ఉంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో దొరికే ఆయిల్స్, షాంపూ వాడాల్సిన అవసరం లేదు.
hair fall tips in telugu
చాలా తక్కువ ఖర్చులో మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. నాలుగు అంగుళాల అల్లం ముక్కని తీసుకుని మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత లవంగాలను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.

పొయ్యి మీద ఒక పాన్ పెట్టి అర కప్పు ఆలివ్ ఆయిల్ వేసి దానిలో అల్లం పేస్టు, రెండు స్పూన్ల లవంగాల పొడి వేసి బాగా కలిపి పది నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత క్లాత్ సాయంతో నూనెను వడగట్టాలి. ఈ నూనెను సీసాలో పోసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనె దాదాపుగా నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. .
Diabetes tips in telugu
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి.
Ginger benefits in telugu
లవంగాలలో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అల్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. హెయిర్ రూట్, ఫోలికల్స్‌ను దృఢంగా మారుస్తుంది. అల్లంలో ఉండే అనేక ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు వెంట్రుకలను బలంగా మారుస్తూ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.