ఈ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Dry Ginger and Honey Benefits : ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ శొంఠి పొడి కలిపి ఉదయం సమయంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శొంఠి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. అలా కాకుండా శొంఠి కొమ్ములను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాన్ లో కొంచెం నూనె వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి.
బాగా వేగిన శొంఠి కొమ్ములను మిక్సీ జార్ లో వేసి సరిపడా ఉప్పు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ గొంతుకి సంబందించిన సమస్యలతో బాధపడతారు.
అటువంటి వారికి ఈ మిశ్రమం మంచి ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్స్ నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా ప్రోత్సహించి జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్, కడుపు ఉబ్బరం,అజీర్ణం మరియు కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నేచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.