ఈ పొడి జ్ఞాపక శక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది
Improve brain health Powder In Telugu: ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడటం వలన అవి మెదడు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తి అనేవి బాగుంటాయి. .
అందువల్ల మెదడు పనితీరు బాగుండేలా మెదడుకు అవసరమయ్యే పోషకాలు అందే విధంగా చూసుకోవాలి. మెదడు చురుగ్గా పనిచేసే జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా అలాగే మతిపరపు సమస్యలు లేకుండా చేయటానికి ఒక పొడిని తయారు చేసుకుందాం. ఈ పొడి కోసం ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పు బాదం పప్పులు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో అరకప్పు వాల్నట్స్ వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న బాదంపప్పు, వాల్ నట్స్ రెండు స్పూన్ల సోంపు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు స్పూన్ల బెల్లం పొడి వేసి మరోసారి మిక్సీ చేయాలి. ఈ పొడిని గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి.
ఈ పొడి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు లేదా తర్వాత గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పొడి వేసి బాగా కలిపి తాగాలి . పది రోజులపాటు ఈ పాలను తాగితే మెదడు ఆరోగ్యంగా మారి జ్ఞాపకశక్తి పెరిగి మతిమరుపు సమస్యలు తగ్గుతాయి.
మనం చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి., ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు అన్ని తొలగిపోయి హుషారుగా ఉంటారు. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి. అలాగే ఈ పొడిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు. ఈ పొడి మెదడు ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.