2020 లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలిస్తే షాక్…?
2020 Hit Movies :కరోనా దెబ్బకు ఈ ఏడాది మార్చి నుంచే థియేటర్లు మూతబడ్డాయి.దాంతో ఈ ఏడాది మార్చి వరకూ విడుదలైన సినిమాలను చూస్తే, కేవలం మూడు సినిమాలు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి చేశాయి. ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోగలిగాయి. బాక్సాఫీసు దగ్గర నుంచి భారీ లాభాలను తెచ్చిపెట్టగలిగాయి.
ముఖ్యంగా ఈ ఏడాది ‘సంక్రాంతి’కి రిలీజైన సినిమాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’..’అల వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కింది. మేజర్ మహేశ్ బాబు కి జోడీగా రష్మిక మందన అలరించింది. చాలా గ్యాప్ తరువాత విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.
ఇక ఈ మూవీ మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. మహేశ్ బాబుకి హ్యాట్రిక్ హిట్ అందించింది. ఈ సినిమా రిలీజైన మర్నాడే బన్నీ నటించిన ‘అల వైకుంఠపురంలో’ థియేటర్లకు వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ ట్రీట్మెంట్ , అల్లు అర్జున్ నటన, పూజాహెగ్డే గ్లామర్ , తమన్ మ్యూజిక్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది. జనవరిలోనే కల్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’, రవితేజ ‘డిస్కోరాజా’, నాగశౌర్య ‘అశ్వద్ధామ’ వచ్చినా ఫలితం లేదు.
ఇక ఫిబ్రవరిలో ‘జాను’ భారీ అంచనాల మధ్య రిలీజయింది. తమిళంలో వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకున్న ’96’ మూవీని ‘జాను’ పేరుతో శర్వానంద్ – సమంత లతో దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేసి ,’96’ దర్శకుడి చేత చేయించినా, ఎందుకో ఈ మూవీ తేడాకొట్టింది.
ఇక విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా భారీ అంచనాల మధ్య రిలీజై, డిజాస్టర్ అయింది. అయితే వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక ఆకట్టుకుంది. చాలా కాలం తరువాత నితిన్ కి సక్సెస్ వచ్చింది. ఇక ‘హిట్’, ‘రాహు’ మూవీస్ చతికిలబడ్డాయి. మార్చిలో ‘పలాస 1978’, ‘ఓ పిట్టకథ’ , ‘ప్రేమ పిపాసి’, ‘శివన్’ సినిమాలు రాగా ఒక్క ‘పలాస’ ఫరవాలేదనిపించుకుంది.