1 స్పూన్ పొడి కీళ్ల నొప్పులు,ఎముకల బలహీనత తగ్గించటమే కాకుండా కాల్షియం లోపం లేకుండా చేస్తుంది
Joint Pains Powder : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పులు వంటివి ఎముకల బలహీనత కారణంగా వస్తున్నాయి. ఈ నొప్పుల నుండి ఉపశమనం .పొందాలంటే మూడు రకాల గింజలను కలిపి పొడిగా తయారు చేసుకుని ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ మూడు రకాల గింజలు మార్కెట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి.
అవిసె గింజలలో ఒమేగా 3, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ గింజలలో ఉండే కాల్షియం ఎముకల బలహీనతను తగ్గించి బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ గింజలలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువును నియంత్రణలో ఉంచుతుంది
ఇక గుమ్మడి గింజల విషయానికొస్తే ప్రోటీన్,ఫైబర్, ఒమేగా 3, మెగ్నీషియం వంటి పాషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలు శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇవి కూడా సూపర్ మార్కెట్స్ మరియు డ్రై ఫ్రూట్ షాప్ లలో సులువుగానే లభ్యం అవుతాయి.
సబ్జా గింజలలో ప్రోటీన్, ఫైబర్,కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం అనేవి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3 నొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు ఆవిసే గింజలను వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక కప్పు సబ్జా గింజలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు గుమ్మడి గీణజాలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఈ మూడు రకాల గింజలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి…లేదంటే అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు.
ఇలా కొద్దిరోజుల పాటు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. అలాగే కాల్షియం లోపం కూడా ఉండదు. కాస్త ఓపికగా శ్రద్ద పెట్టి ఇలా పొడి తయారుచేసుకొని వాడితే నొప్పులు తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.