ఉల్లిపాయను ఎక్కువగా వాడుతున్నారా… ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…ఎందుకంటే…
Onion health Benefits In telugu : ప్రతిరోజు ఉల్లిపాయను కూరల్లో వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ కూరలకు మంచి రుచిని అందిస్తుంది. ఉల్లిపాయ లేనిదే కూర ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. కొంతమంది పచ్చడితో అన్నం తింటున్నప్పుడు తప్పనిసరిగా పచ్చి ఉల్లిపాయని నలుచుకొని తింటుంటారు. కొంతమంది పచ్చి ఉల్లిపాయ తినాలంటే వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు.
ఉల్లిపాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలి, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే రక్తపోటు సమస్య వచ్చేస్తుంది. రక్తపోటు సమస్య ఒక్కసారి వచ్చింది అంటే జీవితకాలం మందులు వేసుకోవాల్సిందే. …
అలా మందులు వేసుకుంటూ ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే తొందరగా నియంత్రణలోకి వస్తుంది. ఒక స్పూన్ ఉల్లిపాయ రసంలో ఒక స్పూన్ తేనె కలుపుకొని ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉల్లిపాయ రసం రెండు స్పూన్లు తీసుకుని దానిలో రెండు స్పూన్ల తేనె, ఒక స్పూన్ అల్లం రసం వేసి బాగా కలిపి భోజనం తర్వాత తీసుకుంటే ఆయాసం, దగ్గు తగ్గుతాయి
ఉల్లిపాయను పేస్ట్ గా చేసి ఆవ నూనెలో వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి ఈ మరిగిన నూనెను వడకట్టి నిల్వచేసుకోవాలి ఈ నూనెను కీళ్ళ నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కొంతమందికి ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఉల్లిపాయ రసాన్ని ముక్కు రంధ్రాల్లో వేస్తే రక్తం కారటం ఆగుతుంది.ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
పాదాల పగుళ్ళు ఉన్నవారు వాటిమీద ఉల్లిపాయ ముక్కతో రుద్దితే పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా మారుతాయి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే తొందరగా ఫలితం వస్తుంది. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం. ఒక స్పూన్ వెనిగర్. ఒక స్పూన్ తేనె కలిపి పిల్లలకు పట్టిస్తే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.