కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Kalonji hair Fall Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. 100 మందిలో 90 మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్యను తగ్గించుకుని జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. .
అయితే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్స్ లో కొన్ని కెమికల్స్ ఉండటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడితే జుట్టు రాలడం ,చుండ్రు, తెల్ల జుట్టు సమస్య, పేల సమస్య వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి. నూనె కాస్త వేడెక్కాక అరకప్పు కలబంద ముక్కలు, గుప్పెడు కరివేపాకు, కలోంజి, మెంతుల పొడి వేసి దాదాపుగా పది నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నూనె చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ప్రతి. రోజు రాసు కోవచ్చు …లేదంటే వారంలో రెండుసార్లు జుట్టుకు పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయొచ్చు. ఈ నూనెను రెగ్యులర్ గా రాస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ఈ నూనెకు ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త శ్రద్ద పెట్టి ఈ నూనెను తయారుచేసుకొని వాడితే జుట్టు కుదుళ్లు బలపడి. రక్తప్రసరణ బాగా పెరిగి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కాబట్టి ఈ నూనెను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.