Healthhealth tips in telugu

గ్రీన్ ఆపిల్ ఎప్పుడైనా తిన్నారా…ఈ పండులో ఉన్న రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Green Apple health benefits in telugu : గ్రీన్ ఆపిల్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. ఇప్పుడు విరివిగానే లభిస్తుంది. పులుపు,తియ్యని రుచి కలిగి ఉండే ఈ ఆపిల్ లో ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్., రాగి, జింక్, మాంగనీస్, పొటాషియం వంటివి కూడా ఉంటాయి.

ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రోజుకు ఒక ఆపిల్ తింటే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కణాల నిర్మాణానికి సహాయపడతాయి.
Thyroid remedies
థైరాయిడ్ సమస్యలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు, మతిమరుపు సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే ఆ సమస్యల నుంచి బయటపడతారు. మెదడులో ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచటం ద్వారా న్యూరో ట్రాన్స్ మిటర్ల పనితీరు మెరుగై అల్జీమర్స్ సమస్య నుండి విముక్తి లభించేలా చేస్తుంది.
asthama
గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే ఆస్తమాను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
Pimples,Beauty
మొటిమలు నివారించటంతోపాటు, కళ్ళక్రింద ఉండే నల్లటి వలయాలు తొలగించటానికి సహాయపడుతుంది. ఒత్తిడి కారణంగా వచ్చే మైగ్రేన్ తలనొప్పి నుండి విముక్తికి గ్రీన్ యాపిల్ తినటం .చాలా మంచిది. జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు, జుట్టురాలే సమస్యను తొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.