రాత్రి సమయంలో పాలు+జీలకర్ర కలిపి తీసుకుంటే….ఏమి అవుతుందో తెలుసా?
milk and jeera benefits :పాలల్లో అర స్పూన్ జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర పాలతో కలిపి తీసుకుంటే.. అజీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అధిక బరువునీ తగ్గించడమే కాకుండా గ్యాస్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
విటమిన్ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను పాలతో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. క్యాల్షియం, ఇనుము లోపించినప్పుడు బాలింతల్లో పాల కొరత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జీలకర్రను పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను పాలతో కలిపి తాగడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మహిళల్లో రక్తహీనతకు జీలకర్ర చెక్ పెడుతుంది. శరీరంలో రక్తనిల్వల్ని పెంచడంలో జీలకర్ర చక్కని ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.
జీలకర్రలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉండటం వలన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తగ్గించడంలో జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.