Healthhealth tips in telugu

ఈ మూలిక జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి అల్జీమర్స్ లేకుండా చేస్తుంది

Vasa Kommu Benefits In telugu : వస అనేది ఒక రకమైన ఔషధ మొక్క. దీనిని ఎన్నో వందల ఏళ్ల నుండి ఆయుర్వేదంలో వాడు తున్నారు. వస కొమ్ము గొంతులోని కఫం తొలగించటమే కాకుండా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. పెల్లెటూర్లలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు.
vasa kommu
ఇప్పటికీ ఈ సాంప్రదాయం చాలా ప్రాంతాలలో కొనసాగుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయంలో వేడిని పుట్టించి అల్సర్లకు, గ్యాస్‌, అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు వస చూర్ణం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గటమే కాకుండా ఆకలి లేని వారిలో ఆకలి కూడా పుడుతుంది.
Brain Foods
నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో సహాయపడి ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది. వస కొమ్ములను పాలలో వేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ కూడా తగ్గుతుంది. అలాగే కంఠస్వరం బాగుంటుంది.
gas troble home remedies
వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి రాస్తుంటే శరీర భాగాల‌పై ఏర్ప‌డే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. వస చూర్ణం అయితే రోజుకు 1-2 చిటికెలు తీసుకోవచ్చు. భోజనం అనంతరం తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వస క్యాప్సూల్స్‌ రూపంలోనూ లభిస్తుంది. వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వలన చర్మ సమస్యలకు పనిచేస్తుంది.
Vasa Kommu benefits
ఒక టీస్పూన్‌ వస చూర్ణం తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చర్మంపై సమస్య ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. వస కొమ్మును తీసుకొనే ముందు ఒకసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం మంచిది. ఈ మూలికను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. కాబట్టి మీరు కూడా వాడి ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.