ప్రతి రోజు 1 లడ్డు తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య అనేది ఉండదు
karjuram nuvvula laddu : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు రక్తహీనత సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
దీని కోసం ఒక లడ్డు తయారు చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక లడ్డూ తింటే రక్తహీనత సమస్య అనేది ఉండదు. దీనికోసం ఒక కప్పు నువ్వులను పాన్ లో వేసి దోరగా వేగించాలి. ఆ తర్వాత అరకప్పు ఖర్జూరంను తీసుకొని గింజలు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత వేగించి పెట్టుకొన్న నువ్వులను కూడా వేసి పొడిగా తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పావు కప్పు ఎండుకొబ్బరి, జీడిపప్పు పలుకులు, బాదం పప్పు వేసి బాగా కలిపి లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. ఈ ఖర్జూరం నువ్వుల లడ్డు ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది. నువ్వులు, ఖర్జూరం రెండింటిలోనూ ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. తెల్ల నువ్వులు కన్నా నల్ల నువ్వులు వాడితే మంచిది. ఎందుకంటే తెల్లనువ్వులతో పోలిస్తే నల్లనువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ లడ్డు ఉదయం సమయంలో తింటే నీరసం,అలసట ,నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు.
ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడటం అనేది ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఖర్జూరం, నువ్వులు రెండూ సులభంగానే అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.