ఆపిల్ కంటే 5 రెట్లు పోషకాలు కలిగిన ఈ పండును ఎప్పుడైనా తిన్నారా… ఊహించని ప్రయోజనాలు
Kiwi Fruit Benefits : కివి పండు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. కానీ ప్రస్తుతం చాలా విరివిగానే లభ్యం అవుతుంది. కివీ పండు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది.
దీనిలో విటమిన్ సి కమలా పండులో ఉండే విటమిన్ సికి రెట్టింపు ఉంటుంది. అలాగే Apple కన్నా 5 రేట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయి. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు సంబందించి సమస్యలు లేకుండా చేస్తుంది.
కివీ పండు జీర్ణ ప్రక్రియలో ఎంజైమ్స్ ని ఏక్టివేట్ చేసి బాగా సాగేలా చేస్తుంది. ఈ పండులో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మన కంటి టిష్యూలు, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో కంటి ఆరోగ్యం బాగుంటుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో లభించే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, హై ఫైబర్ కంటెంట్ మొదలైనవి శరీరంలో కొవ్వును తగ్గించి అధిక బరువును తగ్గిస్తాయి.
అంతేకాక డయాబెటిస్ ఉన్నవారు కూడా లిమిట్ గా తీసుకుంటే మంచిది. మన శరీరంలో ఆమ్ల స్థాయిని నియంత్రణలో ఉంచి. టాక్సిన్లను కంట్రోల్ చేస్తుంది. దీనిలో పీచు అధికంగా ఉండుట వలన మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఆస్తమా తగ్గించటంలో సహాయపడుతుంది. కొల్లాజిన్ అనేది చర్మ ఆరోగ్యానికి సహాయపడే ముఖ్యమైన న్యూట్రియంట్, కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C కొల్లాజిన్ తయారీ లో ముఖ్య పాత్ర వహిస్తుంది.
కివీ లో ఉండే విటమిన్ K మరియు కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన శరీరం విటమిన్ K ను ఎముకల నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కివి పండును తిని ఆ ప్రయోజనాలను పొందండి. వారంలో మూడు సార్లు ఈ పండు తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.