Healthhealth tips in telugu

మొల‌కెత్తిన ఉల్లిపాయ‌ను తింటున్నారా…తినే ముందు ఈ నిజాలను తెలుసుకోండి

Sprouted Onions Health Benefits In Telugu : ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మంది పచ్చి ఉల్లిపాయ కూడా తింటూ ఉంటారు. ఉల్లిపాయను ప్రతి రోజు కూరల్లో వేసుకుంటాము. అందువల్ల ఒక్కోసారి ఎక్కువగా ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు మొలకలు వస్తూ ఉంటాయి.
onion
అలా మొలకలు వచ్చిన ఉల్లిపాయ తినవచ్చా లేదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. మొలకెత్తిన ఉల్లిపాయలో విటమిన్ సి, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, కాపర్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇక ప్రయోజనాల విషయానికి వస్తే…శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరం ఎటువంటి ఇన్ ఫెక్షన్ ని అయినా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
gas troble home remedies
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పొట్టను శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఈ సీజన్ లో ఆస్తమా ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది.
asthama
మొల‌కెత్తిన ఉల్లిపాయ‌ల్లో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మూత్రకోశ వ్యాధుల ఉపశమనం కొరకు కూడా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మొలకెత్తిన ఉల్లిపాయను పాడేయకుండా తినటం అలవాటు చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.