క్యారెట్ ఎక్కువగా తింటున్నారా….ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…
carrot Side Effects : క్యారెట్ ఆరోగ్యంకు చాలా మంచిది.పిల్లల నుండి పెద్దల వరకు అంతా కూడా క్యారెట్‌ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.ఏదైనా ఒక మోస్తరుగా చేస్తేనే బాగుంటుంది, అలాగే క్యారెట్‌ను కూడా అతిగా తినడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు.ఈ విషయం ఏదో అంచనా వేసి కాకుండా ప్రయోగాలు చేసి మరీ నిరూపించారు.
క్యారెట్‌ను ఒక పరిధి వరకు తింటే ఔషదం, అంతకు మించి తింటే విషం.క్యారెట్లో ఉండే పీచు పదార్థం మరియు పోషకాలు రక్తం వృద్దికి బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్లో కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్లు అధిక మొతాదులో ఉంటాయి. ఇవి మానవ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది.
మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రైట్స్ కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. షుగర్లలో ఉన్న రకాలను బట్టి చూస్తే కొన్ని రకాల షుగర్ వ్యాదులు ఉన్న వారు క్యారెట్‌ను తినడం వల్ల షుగర్ ఎక్కువ అవ్వడంతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకున్న వారు అవుతారు.క్యారెట్లో ఉండే గ్లూకోజ్ వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
అందువల్ల షుగర్ బాగా పెరిగే అవకాశం ఉంది.రెగ్యులర్‌గా అధిక గ్లూకోజ్ ఉండే క్యారెట్స్ తినడం వల్ల షుగర్ ఎటాక్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్బంతో ఉన్న మహిళలు ఎక్కువగా క్యారెట్స్ తినడం మంచిది కాదు.క్యారెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్బంలో ఉన్న శిషువుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇక డెలివరీ అయిన తర్వాత రక్తం పెరగడం కోసం క్యారెట్లను తీసుకోవాలి.కాని అవి ఎక్కువ అవ్వడం వల్ల పిల్లలకు ఇచ్చే పాలు క్యారెట్ ఫ్లేవర్‌లోకి మారిపోతాయి.క్యారెట్ తురుముతో స్వీట్లు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా క్యారెట్ హాల్వాను ఎక్కువగా తింటూ ఉంటారు.అది కూడా ఆరోగ్యానికి చాలా హానికరంగా డాక్టర్లు చెబుతున్నారు.క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తినడం మాత్రం అస్సలు మంచిది కాదు.