రోజు భోజనం చేసిన తర్వాత ఇవి రెండు నోట్లో వేసుకుంటే డాక్టర్ అవసరమే ఉండదు…ఇది నిజం
Usiri health benefits In Telugu :ఉసిరిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. .ఉసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిని సీజన్ లో .దొరికినప్పుడు రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం .సీజన్ కానప్పుడు ఉసిరి దొరకదు. అలాంటి సమయంలో ఉసిరిని వాడాలి అంటే సీజన్లో ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండపెట్టి నిలువ చేసుకోవచ్చు
వీటిని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి దానిమ్మ పండులో కంటే 17 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన గొంతు నొప్పి జలుబును తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా నోటిపూతను నయం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.
నోటి పూత ఉన్నప్పుడు ఏమి తినాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఉసిరి నోటి పూత తగ్గించడంలో చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ల నొప్పులను మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
డయాబెటిస్తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అవసరమైన విటమిన్ “సి” అధికంగా ఉంటుంది. అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉసిరి ముక్కలను తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది.
అంతే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉసిరి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మీరు కూడా ఉసిరిని తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.