కొబ్బరి నూనెలో కలిపి రాస్తే జుట్టు నుండి ఒక్క వెంట్రుక రాలదు..రాలిన జుట్టు దగ్గర 2 రెట్లు జుట్టు వస్తుంది
Ginger Hair Fall Tips In Telugu : ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.
వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి కెమికల్స్ లేని మన వంటింట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ తో.నూనెను తయారు చేసుకుని వాడితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె తయారీ కోసం ముందుగా రెండు స్పూన్ల లవంగాలను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.
రెండు అంగుళాల అల్లం ముక్కను మెత్తని పేస్ట్ గా చేయాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి 50 ML కొబ్బరి నూనె వేసి అల్లం పేస్ట్, లవంగాల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నూనె చల్లారాక వడగట్టి ఏదైనా గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, జింక్, కాపర్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాలలో ఉన్న లక్షణాలు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఈ నూనెను వాడి జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.