Healthhealth tips in telugu

రాత్రి పడుకొనే ముందు పాలల్లో బెల్లం కలిపి త్రాగితే ఏమి జరుగుతుందో తెలుసా?

Milk And jaggery Benefits In telugu : మనలో చాలా మంది పాలల్లో పంచదార కలుపుకొని త్రాగుతూ ఉంటారు. అయితే ఆలా పంచదార కాకుండా బెల్లం కలుపుకొని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాక శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది చాలా అవసరం. బెల్లంలో ఐరన్‌, పాలలోని కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలోని సుక్రోజ్‌, గ్లూకోజ్‌, ఖనిజాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్‌, పాలలోని కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలోని సుక్రోజ్‌, గ్లూకోజ్‌, ఖనిజాలు ఉన్నాయి. పాలల్లో లాక్టిక్‌ యాసిడ్‌, ప్రోటీన్స్‌, కాల్షియం, విటిమన్‌-ఎ,బి,డిలు ఉండడం వల్ల ఆరోగ్య పరంగా ఇవి రెండు మంచివి.
gas troble home remedies
బెల్లం జీర్ణాశయ సంబంధిత సమస్యలను దరి చేరనివ్వదు. బెల్లం తీసుకున్న వెంటనే జీర్ణమవుతుంది. అంతేకాక పొట్టలో గ్యాస్‌ను ఉత్పత్తి చేయదు. కాబట్టి గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా త్రాగవచ్చు. మాములుగా ప్రతి రోజు ఉదయం బెల్లం పాలను త్రాగవచ్చు.
sleeping problems in telugu
నిద్రలేమి సమస్య ఉన్నవారు మాత్రం రాత్రి పడుకునే ముందు త్రాగితే నిద్ర బాగా పెట్టటమే కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వానలు వస్తున్నాయి కదా ఇప్పుడు దగ్గు,జలుబు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా బెల్లం పాలను తాగవల్సిందే. అలాగే కీళ్లనొప్పులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది.
blood
రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. శరీరంలో మలినాలను తొలగిస్తుంది. ఉదయం సమయంలో బెల్లం కలిపిన పాలను తాగితే అలసట,నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.