ప్రతి ఇంటిలో ఉండే ఈ మొక్క గురించి ఈ విషయాలు మీకు తెలుసా…అసలు నమ్మలేరు
Nandivardhanam Benefits in telugu : నందివర్ధనం మొక్క సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఈ నందివర్ధనం పువ్వులను ఎక్కువగా పూజకు వాడుతూ ఉంటాం. ఈ పూవులను చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. నందివర్ధనం పువ్వులలో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి.
ఇప్పుడు మనం ఐదు రెక్కల నందివర్ధనం గురించి చెప్పుకుంటున్నాం. ఈ పువ్వులు వర్షాకాలం, ఎండకాలం ఎక్కువ పూస్తాయి. శీతాకాలంలో తక్కువగా పూస్తాయి.నందివర్ధనం పూలు సీజన్ లో లెక్కలేనన్ని పూస్తాయి. ఎక్కువ రోజులు పూస్తాయి. పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది.
ఈ మొక్కల శాస్ర్తియ నామం ఒకటే- టాబర్‌నేమాంటోనియా కొరొనేరియా! వీటిని కేప్ జాస్మిన్ అని కూడా అంటారు. నందివర్ధనంలో అనేక అసాదరణమైన ఔషద గుణాలు ఉన్నాయి. ఈ నందివర్ధనం మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులలో వివరంగా చెప్పారు.
నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతిని, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుంది. నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్ఫ్ల మేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పై పూతగా రాస్తే తొందరగా నయం అవుతాయి.
నందివర్ధనం పువ్వుల రసాన్ని నూనెలో కలిపి ఐ డ్రాప్స్ గా వాడితే ఏమైనా కంటి సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఈ మొక్క వేళ్ళు పంటి సమస్యలను,నోటి సమస్యలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నందివర్ధనం ఆకుల కాషాయన్ని పుక్కిలించటం ద్వారా నోటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొక్క ఆకులలో చర్మ సమస్యలను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి.
నందివర్ధనం మొక్క ఆకులు,కాండం, వేళ్ళు, పువ్వులు అన్నింటిలోనూ ఔషడ గుణాలు సమృద్దిగా ఉన్నాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆకుల రసాన్ని నుదురుకి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నందివర్ధనం పువ్వులను రాత్రంతా నీటిలో వేసి ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే కంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ నీటిని ఉదయం పరగడుపున త్రాగితే కిడ్నీ సమస్యలు,యూరినరీ సమస్యలు తగ్గుతాయి.
నందివర్ధనం పూల రసంలో కర్పూరం వేసి కంటిలో ఒక చుక్క వేసుకుంటే కంటి మంటలు,కన్ను ఎర్రబడటం వంటివి తగ్గుతాయి. అలా కాకుండా తాజా నందివర్ధనం పువ్వులను కళ్లపై పెట్టుకుంటే కంటి ఎరుపుదనం తగ్గి కళ్ళకు చల్లగా ఉంటుంది. అయితే ఈ నందివర్ధనంను ఉపయోగించటానికి ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైధ్య నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.