అరటిపండు+పాలు కలిపి తీసుకుంటే…ముఖ్యంగా బరువు తక్కువ ఉన్నవారు
Banana and Milk Benefits In Telugu : అరటి పండు, పాలు…ఈ రెండింటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. అరటిపండులో అరటిపండులో విటమిన్లు, డైటరీ ఫైబర్ మరియు పొటాషియం సమృద్దిగా ఉంటుంది.
పాలల్లో కాల్షియం మరియు ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఒక అరటి పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలను పోసి మిక్సీ చేసి గ్లాసులో పోసి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ పాలను ఉదయం సమయంలో తీసుకోవాలి.
రాత్రి సమయంలో తీసుకుంటే జలుబు వచ్చే అవకాశం ఉంది. బరువు తక్కువగా ఉన్నవారు ఈ పాలను తాగితే బరువు పెరుగుతారు. అరటిపండు, పాలు రెండింటిలోను కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా ఎముకలకు సంబందించిన సమస్యలు రాకుండా చేస్తుంది.
రక్తపోటును నియంత్రణలో ఉంచటమే కాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. అరటిపండ్లలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో గ్లూకోజ్‌ను స్థిరంగా పంపి వర్కవుట్ చేయడానికి శక్తిని ఇస్తుంది. ఇది కండరాల గ్లియోసెన్ నిల్వలను మరియు పొటాషియంను పెంచి కండరాల తిమ్మిరిని నివారిస్తుంది.
విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఈ పాలను 40 సంవత్సరాలు దాటిన వారు వారంలో మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి. ప్రతి రోజు తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాలు బరువు తక్కువగా ఉన్నవారికి బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.