బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఈ జ్యూస్ తాగితే ఎంత లావుగా ఉన్నా సన్నబడతారు
Pear And Carrot Weight Loss Drink In telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు., ఒత్తిడి, మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. .
అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు ఒక juice తయారు చేసుకుందాం. ప్రతిరోజు ఈ జ్యూస్ తాగుతూ అరగంట వ్యాయామం చేస్తూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే కచ్చితంగా 15 రోజుల్లో బరువు తగ్గటం ప్రారంభం అవుతుంది.
ఈ జ్యూస్ తయారీ కోసం ఒక పియర్ ఫ్రూట్, ఒక ప్లమ్ ఫ్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో రెండు రెబ్బలు కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పియర్ ఫ్రూట్ ముక్కలు, ప్లమ్ ఫ్రూట్ ముక్కలు వేయాలి.
ఆ తర్వాత గింజలు తీసిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్, ఒక గ్లాసు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకోవడం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయం సమయంలో తీసుకోవటం వలన అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా పనులను చేసుకుంటారు. ఈ జ్యూస్ ని ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ జ్యూస్ తాగటానికి ముందు తర్వాత అరగంట పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.