డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రింక్స్ తాగితే షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది
Drinks for Diabetics In Telugu : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్స్ లో ఏది సులభంగా అందుబాటులో ఉంటే ఆ డ్రింక్ తాగి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోండి.
తులసి ఆకులు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా పనిచేస్తాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 5 తులసి ఆకులను వేసి 3 నిమిషాలు మరిగించి వడకట్టి తాగాలి. ఈ విధంగా తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే గుణం తులసికి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
ప్రతి రోజు వంటగదిలో అల్లంను వాడుతూ ఉంటాం. అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో ఉండే జింక్ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అల్లంను నీటిలో మరిగించి వడగట్టి తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
మెంతులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు డయాబెటిస్ నిర్వహణలో ఎలా సహాయపడుతుందో అనే విషయం మీద చాలా పరిశోదన జరిగింది. ఇన్సులిన్ నిరోధకత మరియు డయాబెటిస్ ని నియంత్రించడంలో మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో అరస్పూన్ మెంతులను వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి.
దాల్చిన చెక్క డయాబెటిస్ నిర్వహణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాక గ్లూకోజ్ ప్రాసెసింగ్‌ని అనుమతిస్తుంది. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి
ఖాళీ కడుపుతో తాగడం అలవాటు చేసుకుంటే సహజంగానే రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.