అల్లం నూనె వాడుతున్నారా…మిస్ చేసుకుంటే ఈ లాభాలను కోల్పోయినట్లే…అసలు నమ్మలేరు
Ginger Oil Benefits In Telugu : మనం ప్రతి రోజు వంటలలో అల్లం వాడుతూ ఉంటాం. అయితే అల్లం నూనె కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. అయితే అల్లం నూనె గురించి మనలో చాలా మందికి తెలియదు. అల్లం నుంచి తీసే ఈ నూనె ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఈ నూనె లేత పసుపు రంగులో ఉండి ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల అల్లం నూనెను వేసి బాగా కలిపి ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, టాక్సిన్స్ అన్ని తొలగిపోతాయి.
అలాగే తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. ఈ సీజన్లో సాధారణంగా మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆవిరి పడుతూ ఉంటాం. ఇలా ఆవిరి పట్టినప్పుడు ఆ నీటిలో మూడు చుక్కల అల్లం నూనెను వేస్తే శ్వాస ఫ్రీగా ఆడి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే ఆస్తమా ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి మసాజ్ చేస్తే నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. పొట్టలో విషాలను బయటకు పంపుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు చుక్కల అల్లం నూనె కలిపి తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఏమీ లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. .
ఈ అల్లం నూనె కాలేయంలో మలినాలను మరియు కొవ్వును బయటకు పంపటానికి సహాయపడి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించే శక్తి కూడా ఈ అల్లం నూనెకు ఉంది. ఈ అల్లం నూనె ఆయుర్వేదం షాప్ లలో లభ్యం అవుతుంది. అలాగే Online Stores లో కూడా లభ్యం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.