కాలీఫ్లవర్ ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు…
Cauliflower Health Benefits in telugu :మనలో చాలా మంది కాలీఫ్లవర్ తినటానికి ఆసక్తి చూపరు. ఎందుకంటే కాలీఫ్లవర్ వాసన కొంతమందికి నచ్చదు. అయితే వాటిల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం తప్పనిసరిగా తినటానికి ప్రయత్నం చేస్తారు. ఇక కాలీఫ్లవర్ లో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ ని గోబీ అని పిలుస్తారు. కాలీఫ్లవర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ లో విటమిన్ బి సమృద్దిగాను,క్యాలరీలు తక్కువగాను,పోషకాలు ఎక్కువగాను,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగాను ఉంటాయి. అలాగే పీచు శాతంతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల కాలీఫ్లవర్ ని రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా జీర్ణాశయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
క్యాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ కె ఎముకల దృఢత్వానికీ సహాయపడుతుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ లో ఇంకా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్ లో పీచు,విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే కిడ్నీ సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పని చేస్తుంది.
కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో క్యాలీఫ్లవర్ ను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్ ని కూరల రూపంలో లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవటం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.
ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ని వ్యాయామానికి ముందే లేదా తర్వాత తీసుకుంటే వ్యాయామం కారణంగా వచ్చే కండరాల నొప్పులు ఉండవు.
యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి క్యాలీఫ్లవర్ మంచి పరిష్కారం అని చెప్పాలి. వారానికి రెండు సార్లు క్యాలీఫ్లవర్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ల నుండి బయట పడవచ్చు.
శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపించడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్ తినటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. క్యాలీఫ్లవర్ తినటం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా పొడవుగా పెరుగుతుంది.
గాయాలైన ప్రదేశంలో క్యాలీఫ్లవర్ ఆకు రసాన్ని పూస్తే… వెంటనే ఆ గాయాలు మానిపోతాయి. ఒకవేళ క్యాలీఫ్లవర్ ని నేరుగా తినలేకపోతే… గోబీ మంచూరియా వంటివి తయారుచేసుకొని తినవచ్చు. అలాగని హద్దుమీరి తినకూడదు. వైద్యులు సూచించిన పరిమితిలో తీసుకుంటే మంచిది. కాబట్టి క్యాలీఫ్లవర్ ని తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.