Healthhealth tips in telugu

రోజు చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే…ముఖ్యంగా మతిమరుపు సమస్య ఉన్నవారు…

Dry Coconut benefits in telugu: ఎండుకొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లేత కొబ్బరి తో పోలిస్తే ఎండు కొబ్బరి లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు కొబ్బరి జీర్ణం అవటానికి కాస్త సమయం పట్టినా ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఎండు కొబ్బరిని మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం వంటివి సమృద్దిగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో ఉండే సెలీనియం సేలనో అనే ప్రోటీన్స్ ను పెంచడం ద్వారా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచి మెదడును చురుకుగా ఉంచుతుంది.
Brain Foods
మెదడులోని నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. పక్షవాతం నుండి కాపాడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే మతి మరుపు సమస్యలు దూరం అవుతాయి. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ ఎక్కువగా ఉండే ఎండుకొబ్బరి ని వాడటం వలన రక్త లేమి సమస్య తగ్గుతుంది.
Acidity home remedies
ఎండుకొబ్బరి తో బెల్లం కలిపి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి రోజు చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఎండుకొబ్బరి తినడం వల్ల మలబద్దకం, అల్సర్ , హెమరాయిడ్స్ వంటి జీర్ణ సంబంద సమస్యలు ఉండవు.
blood
కొబ్బరిలో ఫినోలిన్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి శరీర కణాల ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. అలాగే గల్లిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, పి-కొమరిక్ యాసిడ్ ఉన్నాయి. ఎండిన కొబ్బరి శరీరంలో రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.