రాత్రి సమయంలో కమలాపండు తింటున్నారా…ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఉన్నవారు…
Orange Health benefits in telugu :ఏ సీజన్ లో దొరికే ఆ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకోవటం వలన ఆ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.వాటిలో కమలా పండ్ల గురించి తెలుసుకుందాం. కమలా పళ్ళు, సిట్రస్ జాతికి చెందినవి.
అందువల్ల వీటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. అయితే రాత్రి సమయంలో కమలా పండు తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నిర్వహించడానికి మరియు హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
సిట్రస్ పండ్లలో చక్కెర మరియు విటమిన్ సి అధికంగా ఉండుట వలన రాత్రి సమయంలో తింటే నిద్ర సరిగా పట్టక నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందు కమలా పండు తినవచ్చు. ఎందుకంటే సిట్రస్ పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజపరిచి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
అయితే మనలో చాలా మందికి కమలా పండు ఏ సమయంలో తింటే మంచిది…అనే విషయంలో సందేహం ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినవచ్చు. అలాగే పరగడుపున తినకూడదు. ఈ పండులో విటమిన్ సి మరియు పొటాషియంతో సహా కీలకమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.
అందువలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు ఒక కమలా పండు తింటే శరీరానికి అవసరమైన ఐరన్ అంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. కమలా పండులో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. విటమిన్ B6 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.