Healthhealth tips in telugu

నిమ్మకాయ తినే వారు జాగ్రత్త…మర్చిపోయి కూడా ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి

Poisonous food combinations list in Telugu : మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఆహారాలను కలిపి తీసుకుంటూ ఉంటాము. అలా తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలను కలిపి తినడం వలన అవి విషపూరితం అయ్యే అవకాశం కూడా ఉంది.

అలా తినకూడని కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. అరటి పండు, జామ కాయలు ఈ రెండు సంవత్సరం పొడవునా లభిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. జామకాయ,అరటిపండు కలిపి తింటే గ్యాస్,తలనొప్పి,కడుపు నొప్పి అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
pine apple benefits in telugu
అరటిపండు, పైన్ ఆపిల్ రెండింటినీ కూడా కలిపి తీసుకోకూడదు. ఇవి రెండూ త్వరగా జీర్ణం కావు. దాంతో ప్రమాదకరమైన టాక్సిన్స్ విడుదలయ్యి కడుపునొప్పికి కారణం అవుతాయి. కాబట్టి కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకుండా ఉంటే మంచిది. పాలు, పనసపండు కలిపి తినకూడదు. ఇలా తినడం వలన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయి పండు నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది. దాంతో రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నిమ్మకాయ, పాలు కూడా కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే సిట్రస్ పాలు విరిగి పోయేలా చేస్తుంది.

ఇలా రెండింటినీ ఒకే సారి తీసుకోవడం వలన కడుపులో ఉన్న జీర్ణ రసాలతో కలిసి ఎక్కువ ఆసిడ్స్ ని విడుదల చేస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉసిరిపచ్చడి, నిమ్మకాయ పచ్చడి తినకూడదని చెబుతుంటారు. ఆ సమయంలో పచ్చళ్ళు తింటే మెదడులో సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు పగిలిపోయే అవకాశం ఉంది. దాని వల్ల పక్షవాతం కూడా రావచ్చు. అందువల్ల కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.