వాక్కాయలను ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
vakkaya Benefits In Telugu : దేశీయ క్రాన్ బెర్రీస్ అని పిలిచే వాక్కాయ శాస్త్రీయ నామం కరిస్సా కేరందాస్. వాక్కాయను కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. అపోసైనేసి కుటుంబానికి చెందిన వాక్కాయ అడవులలో సహజసిద్ధంగా పెరుగుతుంది. వానాకాలంలో కొన్ని రోజులు మాత్రమే కాయలు కాస్తుంది.
వాక్కాయలతో పప్పు,పచ్చడి,పులిహోర వంటి వాటిని చేస్తారు. వాక్కాయ ఒగరు మరియు పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అందువల్ల వాక్కాయను చింతకాయకు తక్కువ ఉసిరికాయను ఎక్కువ అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ చెట్టు పూవులు తెల్లగా నక్షత్రాకారంలో మంచి సువాసనతో ఉండి గుత్తులుగా పూస్తాయి.
కాయలు కూడా అంగుళం పొడవులో అండాకారంలో గుత్తులుగా కాస్తాయి. కాయలు మొదట ఆకుపచ్చగా ఉండి ఆ తర్వాత గులాబీ రంగులోకి
వస్తాయి. వీటిలో పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల జామ్ కు, జెల్లీల వంటివి చేస్తారు. పంచదార పాకంలో ఉడికించిన కాయలు కేకుల్లో ఫుడ్డింగ్‌లో వాడతారు. వాక్కాయలో ఔషధ గుణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి.
ఈ విషయం చాలా మందికి తెలియదు. వాక్కాయల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త హీనత ఉన్నవాళ్లకు చాలామంచిది. ఈ పండులో విటమిన్ ఎ,విటమిన్ సి,ఫైబర్,calcium,పాస్పరస్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. ఆస్కార్బిక్ ఆమ్లం కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేయటమే కాకుండా పిత్తాశయ సమస్యల నివారణకు సహాయపడుతుంది.
అంతేకాక జ్వరం,డయేరియా,చర్మ సమస్యలకు కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ టోన్ సమస్యలు లేకుండా చేస్తుంది. వాక్కాయలలో యాంటీ మైక్రో బెయిల్ లక్షణాలు ఉండుట వలన ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని దూరం చేసి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
మధుమేహం ఉన్నవారికి వాక్కాయ చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వాక్కాయ ఆకులతో తయారుచేసిన కషాయాన్ని రోజులో రెండు సార్లు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే క్యాన్సర్ కణాల మీద పోరాటం చేస్తుంది.
వాక్కాయలలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యాలను తొలగించటమే కాకుండా బరువు తగ్గించటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తాయి. అంతర్గత రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. అంతేకాక రక్తంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాక వాక్కాయలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలను తగ్గించటమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. వాక్కాయ చెట్టులో పండు,ఆకులు ,బెరడు ఔషధంగా పనిచేస్తాయి. వాక్కాయను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చర్మం మీద వచ్చే దద్దుర్లను కూడా సమర్ధవంతంగా తగ్గిస్తుంది. ఆకలి లేని వారిలో ఆకలి పుట్టేలా చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఔషధం అని చెప్పవచ్చు.
బాగా దాహంగా అనిపించినప్పుడు వాక్కాయను తింటే సమస్య తీరిపోతుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. వాక్కాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ఈ సీజన్ లో విరివిగా దొరికే వాక్కాయలను పప్పు,కూర,పచ్చడి వంటివి చేసుకొని తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వాక్కాయలను పచ్చిగా కూడా తినవచ్చు.
వాక్కాయలను కోసి మధ్యలో ఉండే పప్పును తీసేసి ఉప్పు,కారం నలుచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే వదలకుండా వాక్కాయలను తింటారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న వాక్కాయలను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.