1 గ్లాసు ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు
Clogged Arteries And Lower Cholesterol Tips : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం వంటి అనేక రకాల కారణాలతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఈ స్థాయిలను తప్పనిసరిగా తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపోటు సమస్యలు వస్తాయి.
అలాగే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
అర్జున బెరడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గుండెకు సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అర్జున బెరడును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. అర్జున బెరడు లేదా పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి.
ఆ తర్వాత అరస్పూన్ అర్జున బెరడు పొడి,పావు స్పూన్ యాలకుల పొడి,చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి ప్రతి రోజు తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి రక్తనాళాల్లో బ్లాకేజ్ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి.
ఈ డ్రింక్ తాగటం వలన రక్తనాళాలు శుభ్రం అవుతాయి. కాలేయం నిర్విషీకరణ జరుగుతుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఈ మూడు ఇంగ్రిడియన్స్ చాలా సులభంగా అందుబాటులోనే ఉంటాయి. ఈ రెమిడీ ఫాలో అవ్వండి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సూచన ప్రకారం మందులు వాడుతూ ఈ డ్రింక్ తాగితే చాలా త్వరగా ఫలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.