రాత్రికి రాత్రే వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులను మాయం చేసే రామబాణం లాంటి ఔషధం
nutmeg benefits in telugu : మనలో చాలా మంది కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది ఈ సమస్యలన్నింటికీ జాజికాయ మంచి పరిష్కారం చూపిస్తుంది
జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్., యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకల్లో లేదా కండరాల్లో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. జాజికాయతో నూనె తయారు చేసుకుని వాడితే ఎలాంటి నొప్పులు అయినా సులభంగా తగ్గిపోతాయి.
ఒక బాణలిలో నాలుగు స్పూన్ల ఆవనూనె వేసుకోవాలి.
దానిలో ఒక స్పూన్ జాజికాయపొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి అర స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఈ నూనెను ఒకేసారి ఎక్కువగా తయారుచేసుకుని సీసాలో పోసుకుని నిలువ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు కొంచెం నూనె తీసుకొని వేడి చేసి నొప్పులు ఉన్న భాగంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే ఎలాంటి నొప్పులు అయినా తగ్గిపోతాయి.
అంతేకాకుండా ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో చిటికెడు జాజికాయ పొడి,చిటికెడు పసుపు కలుపుకొని తాగితే డయబెటిస్,నిద్రలేమి సమస్యలు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే
జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి.
కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి జాజికాయ చాలా బాగా సహాయపడుతుంది. ఒక స్పూన్ తేనెలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి రాత్రి పడుకోవటానికి గంట ముందు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. కాబట్టి జాజికాయ పొడిని ఇప్పుడు చెప్పిన విధంగా వాడి ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.