Healthhealth tips in telugu

ముల్లంగిని ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా గ్యాస్ సమస్య ఉన్నవారు….

Radish health benefits in Telugu : ముల్లంగిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ముల్లంగి వాసన కారణంగా మనలో చాలామంది తినటానికి ఇష్టపడరు. ముల్లంగిలో ఉన్న పోషకాలు గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తినటానికి ప్రయత్నం చేస్తారు.

సాధారణంగా ముల్లంగిని సలాడ్ పరాటా సాంబార్ వంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. ముల్లంగిని ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ముల్లంగిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు ముల్లంగికి దూరంగా ఉంటేనే మంచిది.
gas troble home remedies
కొంతమందికి ముల్లంగి తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముల్లంగి తినే విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఖాళీ కడుపుతో తినకూడదు. ఇలా తింటే గ్యాస్ సమస్య వస్తుంది. అలాగే రాత్రి సమయంలో కూడా ముల్లంగికి దూరంగా ఉంటేనే మంచిది.
radish beenfits
రాత్రి సమయంలో తింటే కడుపుబ్బరం సమస్య వచ్చే అవకాశం ఉంది. అందువలన ముల్లంగిని సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిది. ముల్లంగిని బ్లాక్ సాల్ట్ తో కలిపి తీసుకుంటే మంచిది. ఇలా చేయటం వలన ముల్లంగిలోని ఆమ్ల స్వభావం నియంత్రణలో ఉండి కడుపులో ఎసిడిటీ సమస్యలు లేకుండా చూస్తుంది.
weight loss tips in telugu
ముల్లంగి అంటే ఎలర్జీగా ఉన్నప్పుడూ పెరుగును వినియోగించాలి. చర్మంపై దురద, కడుపు నొప్పి సమస్య ఉంటే.. తప్పనిసరిగా ముల్లంగి పరాటాను పెరుగుతో పాటు తింటే మంచిది. ఇలా చేయడం వల్ల పెరుగు ముల్లంగి ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. తద్వారా కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.