MoviesTollywood news in telugu

మాయదారి మల్లిగాడు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు… అసలు నమ్మలేరు

Mayadari Malligadu Movie : తేనెమనసులు మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి,తక్కువకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి, సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుపడ్డారు. మంచి మనసున్న మనిషిగా గురింపు తెచ్చుకున్నారు. అయితే తనను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు అంటే కృష్ణకు ఎనలేని గౌరవం.

ఆదుర్తికి సినిమాలు లేని సమయంలో మాయదారి మల్లిగాడు సినిమాకు దర్శకునిగా ఛాన్సిచ్చి ఋణం తీర్చుకున్నారు. అప్పటికే బాలీవుడ్ కి వెళ్లి హిందీ సినిమాలు తీసి ఆర్ధికంగా కూడా దెబ్బతిన్న ఆదుర్తి చెన్నై వచ్చేసారు. కొత్తవాళ్లతో సినిమా తీయాలనిపించి హీరోగా శరత్ బాబుని సెలెక్ట్ చేశారు. అయితే ఆయన శ్రేయోభిలాషులు వారించారు.

దెబ్బతినేసిన నీవు ఇంకా కూరుకుపోతావు అందుకే నువ్వు పరిచయం చేసిన కృష్ణ దగ్గరకు వెళ్లి డేట్స్ అడుగు అని శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. కృష్ణ దగ్గరకు వెళ్లి ఆదుర్తి విషయం చెప్పిందే తడవుగా ,కథ గురించి గానీ మరొకటి గానీ అడక్కుండానే డేట్స్ ఇచ్చేసాడు. అప్పటికే క్యూలో చాలామంది ప్రొడ్యూసర్లు,డైరెక్టర్లు ఉండగా వాళ్ళను కాదని ఆదుర్తికి ఒకే చెప్పాడు.

డేట్స్ ఇవ్వడంతో అన్నపూర్ణ పిక్చరర్స్ వాళ్ళు ముందుకొచ్చి, డిస్ట్రిబ్యూషన్ కి ఒప్పుకుంటూ, బ్లాక్ అండ్ వైట్ లోనే తీయాలని, పెట్టుబడి 8లక్షలు ఇస్తామని కండీషన్ పెట్టారు. విషయం తెల్సిన కృష్ణ స్పందిస్తూ, ఆరోజుల్లోనే తేనె మనసులు కలర్ లో తీసిన మీరు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీయడం ఏమిటి సార్, కలర్ లోనే తెద్దాం అని అన్నాడు.

అలా తీసిన మాయదారి మల్లిగాడు సోషల్ క్యారెక్టర్ సినిమాల్లో విభిన్నమైనది. గళ్ళ లుంగీ, లావు బెల్టు, తెల్లని లాల్చీ, మెడల్ స్కార్ఫ్ , చేతిలో కర్ర … చివరి వరకూ కృష్ణ గెటప్ ఇదే. అన్యాయాల్ని ,అక్రమాల్ని ఎదిరించే అందమైన రౌడీ గెటప్ బాగా సూటయింది. గురువు ఆదుర్తి ఎదుట కృష్ణ కూర్చునేవాడు కాదు, శిష్యుడి వినయం,ఎదుగుదల చూసి ఆదుర్తి మురిసిపోయేవారు.

సినిమా పూర్తయ్యేవరకూ రెమ్యునరేషన్ తీసుకోలేదు సరికదా, నిర్మాతగా ఉన్న ఆదుర్తి బావమరిదికి డబ్బులు కూడా కృష్ణ ఆఫర్ చేసారు. దీంతో 11లక్షల్లో మూవీ పూర్తయింది. దాంతో గుంటూరు ఏరియా హక్కుల్ని కృష్ణకు రెమ్యునరేషన్ గా ఆదుర్తి ఇచ్చారు. 1973అక్టోబర్ 5న మూవీ రిలీజయింది.

కృష్ణ ,మంజుల జంట కుదిరింది. సినిమా ఘనవిజయం సాధించింది. వసూళ్ళ పరంగా కూడా మంచి విజయం సాధించింది. అయితే కొన్ని సెంటర్స్ లో 49రోజులకు అన్నపూర్ణ పిక్చర్స్ తీసెయ్యడం కృష్ణ ఫాన్స్ కి నచ్చలేదు.