ఈ జ్యూస్ రక్తాన్ని శుద్ది చేయటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ ని నియంత్రిస్తుంది
Blood purifies Best Juice : మన శరీరంలో అవయవాలు సక్రమంగా పని చేస్తే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మారిన జీవనశైలి పరిస్థితులు, ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో రక్తంలో మలినాలు పేరుకు పోతూ ఉంటాయి.
ఇలా మలినాలను, కొలెస్ట్రాల్ ని తొలగించడానికి అలాగే రక్తాన్ని శుద్ధి చేయడానికి ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అయితే మనం ఒక జ్యూస్ తీసుకుంటే ఈ ప్రక్రియ మరింత సులభం అవుతుంది. ఇప్పుడు చెప్పే జ్యూస్ వారంలో రెండు సార్లు తీసుకుంటే రక్తం శుద్ది అవటమే కాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ జ్యూస్ కి ఉపయోగించే అన్ని ఇంగ్రిడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాస్త ఓపికగా చేసుకొని వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ జ్యూస్ ని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.
ఈ జ్యూస్ కోసం అర కప్పు కొత్తిమీర, అర కప్పు పుదీనా ఆకులు, 10 వేపాకులు తీసుకుని నీటిలో వేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ సాయంతో వడగట్టాలి. ఈ జ్యూస్ లో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్, పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలిపి తాగాలి.
ఉదయం పరగడుపున ఈ జ్యూస్ తాగితే రక్తంలో మలినాలన్నీ తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది. అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంతా తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఈ juice ని వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచి సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.