Healthhealth tips in telugu

పాలు కంటే ఎక్కువ రెట్లు కాల్షియం ఉండే వీటిని అసలు మిస్ చేసుకోవద్దు…జీవితంలో కాల్షియం లోపం ఉండదు

Calcium Rich Food In Telugu : కాల్షియం మన శరీరానికి సమృద్దిగా అందాలంటే మనలో చాలా మంది పాలను తాగితే సరిపోతుందని భావిస్తారు. అయితే పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి. అలాగే కొంతమందికి పాలు తాగితే ఎలర్జీ వస్తుంది. అటువంటి వారికి ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం లేకుండా చేస్తాయి.

ఎముకలు దృఢంగా ఉండాలంటే శరీరానికి కాల్షియం అవసరం. కాల్షియం, విటమిన్ డితో కలిసి క్యాన్సర్, మధుమేహం మరియు అధిక రక్తపోటు నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది. ఎముకలు మరియు దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అవసరం. అందువల్ల కాల్షియం అనేది శరీరంలో తగినంత పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.
calcium foods
అసలు మన శరీరానికి రోజుకి ఎంత కాల్షియం అవసరం అవుతుందో చూద్దాం. 19-50 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్దవారికి రోజుకు 2,500 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. 51 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రోజుకు 2,000 మిల్లీగ్రాములు కాల్షియం అవసరం అవుతుంది.

తోటకూరలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తున్నాయి. ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు తోటకూరను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. ఎముకలు ఏర్పడటానికి మరియు అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యమైనది.
Anjeer benefits
అంజీర్ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీంట్లో కాల్షియంతో పాటు ఫైబర్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో రెండు అంజీర్ లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన అంజీర్ ని నీటితో సహ తినాలి. ఇలా అంజీర్ తినటం వలన కాల్షియం లోపం తగ్గటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు.

నువ్వులలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచిది. నువ్వులు,బెల్లం కలిపి కూడా తీసుకోవచ్చు. నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు.
oats benefits
ఒట్స్ లో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఒట్స్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఒట్స్ లో కాల్షియం మరియు ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. వీటిని తీసుకుంటే కాల్షియం లోపం తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు. కార్న్ ఫ్లేక్స్ కంటే ఒట్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.