Healthhealth tips in telugu

1 గ్లాస్ 15 రోజులు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా నీరసం,అలసట ఉండవు

Weight Loss Milk in telugu : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారు. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే నెల రోజుల్లో బరువు తగ్గడం గమనించి చాలా ఆశ్చర్యపోతారు.
Weight Loss tips in telugu
బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన రీతిలో జరగాలి. ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ నువ్వులను దోరగా వేగించి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మనం ఎక్కువగా తయారుచేసుకుని కూడా నిలువ చేసుకోవచ్చు. మిక్సీ జార్ లో అవిసే గింజలు, నువ్వుల పొడి వేయాలి.
Health Benefits of Dates
ఆ తర్వాత నాలుగు ఎండు ద్రాక్షలు వేయాలి. ఆ తర్వాత గింజ తీసిన ఖర్జూరాలు మూడు వేయాలి. పావు స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాసు పాలు, మూడు వాల్ నట్స్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ పాలను ఉదయం సమయంలో తీసుకుంటే నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమీ రావు. ఈ పాలల్లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు బరువు తగ్గటానికి మరియు నీరసం లేకుండా ఉషారుగా ఉండటానికి సహాయపడుతుంది.

అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు కూడా ఈ పాలను తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పాలను నెల రోజుల పాటు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.