మట్టి కప్పులో టీ తాగుతున్నారా…ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
kulhad Tea Benefits In telugu : ఈ మధ్య కాలంలో మట్టి కప్పులలో టీ తాగటం అలవాటు అయింది. మనలో చాలా మంది మట్టి కప్పులో టీ తాగటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మట్టి కప్పులో Tea తాగితే ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉదయం లేవగానే టీ తాగితే కానీ ఏ పని చేయాలని అనిపించదు.
అలా టీ అనేది మన జీవితాల్లో ఒక బాగం అయ్యిపోయింది. పూర్వం మట్టి పాత్రల్లో వంటలు చేసుకోవటం, మట్టి కప్పులో టీ తాగటం వంటివి చేసేవారు. మరలా ఇప్పుడు మట్టి కప్పులలో టీ తాగటం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ కప్పులో టీ తాగటం వలన అందులోని రసాయనాలు వేడి టీలో కలిసిపోయి శరీరంలోకి చేరుతాయి.
శరీరంలోకి చేరిన రసాయనాల వల్ల జీర్ణవ్యవస్థ చాలా దెబ్బతింటుంది. అదే మట్టి కప్పులో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఎటువంటి హాని జరగదు. మట్టిలో కాల్షియం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మట్టి కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో కాల్షియం కూడా పెరుగుతుంది. అలాగే ఇది టీ యొక్క ఆమ్లతను తగ్గిస్తుంది.
టీ తాగిన తర్వాత గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్‌లో లభించే ప్లాస్టిక్ కప్పులు, గాజు కప్పులను చాలాసార్లు కడిగి వాడతారు. అలా వాడటం వలన వాటిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. మట్టి కప్పును ఒక్కసారే వాడతారు. కాబట్టి ఎలాంటి చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించదు.
మట్టితో తయారు చేసిన కప్పులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. వాటిని ఉపయోగించి బయట పాడేసినప్పుడు మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. మట్టి కప్పులో టీ తాగటం వలన మన ఆరోగ్యానికి మంచిది. అలాగే పర్యావరణానికి కూడా మంచిది…కాబట్టి బయటకు వెళ్లినప్పుడు మట్టి కప్పులో టీ తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.