బొప్పాయి పండు తింటున్నారా…ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు…
Papaya In telugu : బొప్పాయి పండు అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. బొప్పాయి పండు తియ్యని రుచితో ఉంటుంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండు తినకూడదని నిపుణులు చెప్పుతున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో బొప్పాయి తినవద్దని నిపుణులు చెప్పుతారు. ఎందుకటే నెలలు నిండకుండా తొందరగా డెలివరీ అవ్వటం, శిశువును పట్టుకున్న బొడ్డు తాడు చాలా బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయి పండు గుండెకు మేలు చేస్తుంది. అయితే హార్ట్ బీట్ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఎందుకంటే బొప్పాయిలో ఉండే ఒక రకమైన అమైనో ఆమ్లం హార్ట్ బీట్ సమస్యను పెంచుతుంది.
కొంతమందికి అలెర్జీ సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి బొప్పాయి పండు తిన్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కళ్ల నుంచి నీరు రావడం వంటి సమస్యలు వస్తాయి. బొప్పాయి పండు వాసన చూస్తే కొందరికి అలర్జీ వస్తుంది. అలాంటి వారు కూడా బొప్పాయి పండును దూరంగా ఉంటేనే మంచిది.
బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉన్న పండు అని చెప్పుతారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే విటమిన్ సి శరీరంలోకి చేరితే కిడ్నీలో రాళ్ళు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు. కొత్త రాళ్లు కూడా ఏర్పడవచ్చు…లేదంటే కిడ్నీలో ఉన్న రాళ్ళు పెద్దగా మారవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉన్నవారు కూడా బొప్పాయి పండును తినకూడదు. దీంతో మధుమేహం నిర్వహణ కష్టమవుతుందని చెబుతున్నారు. కొందరికి గుండె కొట్టుకునే వేగం పెరగడం, వణుకు, మానసిక గందరగోళం వంటివి కలుగుతాయి. కాబట్టి బొప్పాయి పండుకు దూరంగా ఉండటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.