Healthhealth tips in telugu

పులుపు కోసం కూరలో చింతపండు వేస్తున్నారా…ఈ నిజాన్ని తెలుసుకోకపోతే…

Chintapandu benefits In Telugu : మనం ప్రతి రోజు చేసుకొనే కూరల్లో చింతపండు వేస్తూ ఉంటాం. చింతపండు పుల్లగా ఉండి కూరకు మంచి రుచి వస్తుంది. అయితే చింతపండు ఎక్కువగా వాడితే సమస్యలు వస్తాయి. చింతపండులో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్ ఎ, బి3, బి9, సి మరియు కె వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి.

చింతపండులో డైటరీ ఫైబర్, పొటాషియం మరియు టార్టారిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఫ్లేవనాయిడ్లు మరియు పాలీఫెనాల్స్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఆధునిక జీవనశైలి కారణంగా మన వ్యవస్థలో అత్యంత ప్రభావితమైన అవయవాలలో ఒకటి కాలేయం. ఇది నిర్విషీకరణ మరియు జీర్ణక్రియపై కీలకమైన పాత్రను కలిగి ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి చింతపండు సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో కూడా చింతపండు సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో వచ్చే వికారం, మార్నింగ్ సిక్నెస్ మరియు అతిగా తినడం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చింతపండు చాలా హెల్ప్ చేస్తుంది. శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అయితే లిమిట్ గా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
gas troble home remedies
చింతపండు ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారు చింతపండు వాడకూడదు. చింతపండుకు బదులుగా టమోటా,నిమ్మరసం వంటి వాటిని వాడుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఉన్నవారు అసలు చింతపండు వాడకూడదు. ఒకవేళ వాడితే గ్యాస్ సమస్య తీవ్రం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.