కొబ్బరినూనెలో ఈ పొడి కలిపి జుట్టుకి పట్టిస్తే జుట్టు రాలకుండా 100 % ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Growth Tips In Telugu : జుట్టు పొడవుగా ఉంటేనే అందంగా ఉంటుంది. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వేల కొద్ది డబ్బులను ఖర్చుపెట్టి రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఒక స్పూన్ మెంతులను, ఒక స్పూను కలోంజి విత్తనాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఎండు ఉసిరికాయ ముక్కలను తీసుకొని మెత్తని పొడిగా చేసుకుని పక్కన పెట్టాలి.
ఇక ఒక బౌల్ లో పది స్పూన్ల నూనె తీసుకొని మెంతుల పొడి, కలోంజీ విత్తనాల పొడి, ఉసిరి పొడి వేసి బాగా కలిపి డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాయాలి. ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గుతుంది. .
ఈ నూనెను వారానికి ఒకసారి లేదా రెండు సార్లు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన గంట తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.ఈ విధంగా చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు., దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏమీ ఉండవు.
ఈ నూనెను ఎక్కువ మొత్తంలో చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా మారటానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ నూనెను తయారుచేసుకొని జుట్టు సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.