కేవలం 2 నిమిషాల్లో గొంతు గరగర దగ్గు,జలుబు,గొంతునొప్పి అన్ని తగ్గిపోతాయి…ముఖ్యంగా ఈ సీజన్ లో
cough and cold home remedies In telugu: గొంతులో గరగర ఉంటే వెంటనే మనం విక్స్ వేసుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల సమస్య తగ్గదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే గొంతులో గర గర, గొంతు నొప్పి,గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు పూర్తిగా తగ్గిపోతాయి. దీనికోసం ఒక టీ తయారు చేసుకోవాలి.
టీ తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో నాలుగు బాదం పప్పులను నీటిని పోసి నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదంపప్పులపై తొక్క తీసి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత ఐదు మిరియాలు. రెండు గింజలు తీసిన ఖర్జూరాలు. అరకప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. .
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ లో సగం పసుపు వేసి రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఈ పాలను రోజులో ఒకసారి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.
ముఖ్యంగా ఈ సీజన్లో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పాలు చాలా బాగా సహాయపడతాయి. ఏ సమస్యలు లేని వారు ఈ పాలను వారంలో రెండు సార్లు తీసుకుంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమి రావు. కాబట్టి కాస్త ఓపికగా ఈ పాలను తయారు చేసుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఈ పాలల్లో మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి ఈ పాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ పాలు అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.